ఈ నెల 17న తెలంగాణ బంద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

14, నవంబర్ 2018, బుధవారం

ఈ నెల 17న తెలంగాణ బంద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు


బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఈ నెల 17న రాష్ట్ర బంద్‌ చేపడుతున్నట్లు ప్రకటించారు. 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీలకు రాజకీయ పార్టీలు మొండి చెయ్యి చూపించాయని కాంగ్రెస్‌ 13 మంది బీసీలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చిందని చెప్పారు. మొత్తం అభ్యర్థుల్లో 23 మంది రెడ్డి సామాజికవర్గం నేతలే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, కేవలం ధనస్వామ్యమే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభాలో కేవలం 4 శాతం ఉన్న రెడ్లకు 23 సీట్లు ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని నిలదీశారు. బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే తమ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో రెడ్డి సామాజికవర్గానికి 23, బీసీలకు 13, వెలమ సామాజిక వర్గానికి 3, మున్నూరు కాపులకు ఐదు, మాదిగ 10, మాల- 5, లంబాడీ-2, ఆదివాసీ- 4, మైనార్టీ- 4, గౌడ్‌ నలుగురు, బ్రాహ్మణ, పద్మశాలీ, యాదవ కులాలకు చెందిన ఒక్కొక్కరకు దక్కాయి. ఈ జాబితాలో 10 మంది మహిళలకు చోటు దక్కింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad