భారత దేశం లో ఏందుకని బాలల దినోత్సవం ఆరు రోజుల ముందుగా జరుపుకుంటారు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

14, నవంబర్ 2018, బుధవారం

భారత దేశం లో ఏందుకని బాలల దినోత్సవం ఆరు రోజుల ముందుగా జరుపుకుంటారు

Kushi_sannavi_Chacha_nehru


ప్రపంచమంతా నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకొంటుంది, కానీ మన భారత దేశంలో మాత్రం దీని ఆరు రోజుల ముందుగా జరుపుకుంటాం. బాలల దినోత్సవం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది భారత దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ. ఈయనకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. మన దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించి, బ్రిటిష్ పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తనదైన శైలిలో, ముందుచూపుతో పురోగతి దిశగా నడిపించిన మన పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజును మన దేశం లో " చిల్డ్రన్స్ డే " గా జరుపుకుంటాం.

జవాహర్ లాల్ నెహ్రూ గురించి కొన్ని మాటలు : 


జవాహర్ లాల్ నెహ్రూ 1889 నవంబరు 14  న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ వద్ద జన్మించారు.
ఈయనకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు.  ఆయణ్నిపిల్లలు ముద్దుగా ‘చాచా నెహ్రూ’ (మేనమామ), ‘చాచాజీ’ (బాబాయి) అని పిలుచుకుంటారు.

ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రుకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు.తన కుమార్తె ఇందిరకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే.

జవాహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకొనుటకు గల కారణాలు: 



  • స్వాతంత్య్రానికి ముందు బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న నిర్వహించుకునేవాళ్లం. 1964 వరకు మనం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాం.
  • పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు, చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
  •  నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం.
  • నేటి బాలలే రేపటి పౌరులు. వారిని నేడు సంరక్షిస్తే రేపటి దేశం బాగుంటుంది అనేది చాచా నెహ్రూ అంతరంగం.


నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ ఏందుకని పెట్టుకుంటారు: 


ఒకరోజు ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అదిచూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లల గుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు.

బాలల దినోత్సవం ప్రత్యేకతలు : 


ఈ రోజున భారత దేశం లోని అన్ని పాఠశాలల్లో పండగ వాతావరణం ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, ఇతర కానుకలను పంచిపెడతారు.
పిల్లలకు తమమ ప్రతిభాత్ను ప్రదర్శించుకోవడానికి కొన్ని వ్యాస రచన, క్విజ్ పోటీలు, సాంసృతిక కార్యక్రమాలు,  వేషధారణ వంటి కార్యక్రమాలను నిర్వహించి వారికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో భాగంగా మన తెలంగాణ నుండి నాల్గవ తరగతి చదువుతున్నా బాలిక  తెలంగాణ వచ్చాక పల్లెలో జరిగిన మార్పులను గురించి అద్భుతంగా వివరించింది . ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్గా మారింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad