బిచ్కుందలో పేలిన గ్యాస్ సిలిండర్ ఇద్దరు సజీవ దహనం - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

25, నవంబర్ 2018, ఆదివారం

బిచ్కుందలో పేలిన గ్యాస్ సిలిండర్ ఇద్దరు సజీవ దహనం


 బిచ్కుంద మండలకేంద్రంలో ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఆర్డీవో రాజేశ్వరరావు మరియు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad