హైదరాబాద్ లో ఫేక్ కన్సల్టెన్సీ ముఠా అరెస్ట్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

14, నవంబర్ 2018, బుధవారం

హైదరాబాద్ లో ఫేక్ కన్సల్టెన్సీ ముఠా అరెస్ట్


హైదరాబాద్ కు జాబ్ కోసం వచ్చి, జాబ్ దొరకక  చివరికి కన్సల్టెన్సీ నమ్ముకొని మోసపోయేవాళ్లు చాలామంది వుంటారు. వీరికోసం తెలంగాణ పోలీస్ శాఖ ఫేక్ కన్సల్టెన్సీ ముఠాలను ఏరిపారేస్తుంది . అదేవిధముగా విద్యార్థులకు , జాబ్స్ వెతికేవారికి ఈపాటికే కన్సల్టెన్సీ నమ్మావద్దని హెచ్చరించింది.

తాజాగా హెద్రాబాద్లో ఫేక్ కన్సల్టెన్సీ ముఠానుండి ఐదుగురిని పోలీస్ బృందం అదుపులో తీసుకుంది. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపిన సమాచారం ప్రకారం " 680 నకిలీ విద్య సర్టిఫికేట్, 680 అసలు సర్టిఫికేట్లు, 96 నకిలీ రబ్బరు స్టాంపులు, 3 ల్యాప్టాప్లు, 10 పెండ్రీవ్ను స్వాధీనం చేసుకున్నట్టు అంతేకాకుండా వారినుండి నకిలీ పాస్ పుస్తకాలు, ఆంధ్రా బ్యాంక్ నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు" అయన తెలిపారు.

ముదయిలు జే శ్రీకాంత్ రెడ్డి, మొహమ్మద్ అథీక్, కె శరత్ చంద్ర, ఇమ్రాన్ షేక్ మరియు అఖిల్ బాధితుల నుండి  50,000 నుండి 60,000 రూపాయలు తీసుకోని నకిలీ పాస్పోర్ట్ లు చేసి బాధితులను మోసగించారు. ఈ ఫేక్ కన్సల్టెన్సీ ముఠా  OU, JNTU, మద్రాస్ విశ్వవిద్యాలయం మరియు కాకతీయ విశ్వవిద్యాలయం యొక్క నకిలీ సర్టిఫికెట్లు ముద్రించినట్టు తెలుస్తుంది. SR నగర్, బేగంపేట్, సింధీ కాలనీ మరియు పద్మావతి ప్లాజా లో వీరి ఆఫీస్ లు ఉన్నట్లు పోలీస్ లు గుర్తించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad