పందెం కోడి 2‌ మూవీ రివ్యూ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

19, అక్టోబర్ 2018, శుక్రవారం

పందెం కోడి 2‌ మూవీ రివ్యూ


చిత్రం: పందెం కోడి 2‌
విడుదల తేదీ: 18 October 2018
దర్శకుడు: లింగుసామి
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: విశాల్‌
సినిమాటోగ్రాఫర్‌: కేఏ శక్తివేల్
గ్రేడ్ : U/A
రన్ టైం : 150 minutes
రేటింగ్  : 5/10


కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు సంపాందించిన హీరో విశాల్. 13 ఏళ్ల క్రితం రిలీజైన పందెం కోడి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా పందెం కోడి2.మహానటి తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో విశాల్ తో కల్సినటించారు . అయితే ఈ సినిమా పందెం కోడి లాగా క్రజ్ తేలేక పొయ్యింది.

వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించిన కథ ఈ పందెం కోడి2. తెలుగులో ఈ తరహా ఫ్యాక్షన్‌ కథలు గతంలో చాలానే వచ్చాయి.

తొలిభాగంలో ఎక్కువ భాగం ఫ్యాక్షన్ గొడవలు, జాతర అంశాలు పైచేయిగా ఉంటాయి. ఈ అంశాల మధ్య విశాల్, కీర్తి సురేష్ రొమాంటిక్ ప్రేమ కథ కొంత ఆట విడుపుగా ఉంటుంది. ఒకటే పంథాలో సాగడం, తెలియని నటీనటులు తెర మీద హడావిడి చేయడం, నేటివిటి సమస్య తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉంటుంది. వీటన్నిటిని కీర్తీ సురేష్ తన చిలిపి నటనతో కప్పిపుచ్చే ప్రయత్నిం చేసింది. ఓ ఆసక్తికరమైన, భావోద్వేగమైన సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

ప్రత్యర్థుల దాడిలో తండ్రి రాజారెడ్డి హాస్పిటల్ పాలవ్వడంతో బాలు పాత్ర ప్రధానంగా మారుతుంది. సెకండాఫ్‌లో ఊరి ప్రజలకు తెలియకుండా తండ్రి చికిత్స జరగడమనే ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ ఉంటుంది. తండ్రి పరిస్థితిని ఊరి ప్రజలకు తెలియకుండా ఆడే రెండు, మూడు సన్నివేశాలతో సినిమా కొంత మెరుగ్గా అనిపిస్తుంది. తండ్రి మాట కోసం ప్రేమను కూడా త్యాగం చేయడానికి బాలు సిద్దపడటం కొంత ఎమోషన‌ల్‌గా ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్‌లో భవానీ, ఆమె కొడుకు మధ్య వచ్చే భావోద్వేగమైన ఎపిసోడ్‌తో సినిమాకు తెరపడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad