పోలీసుల ముందే భార్యపై కత్తితో దాడి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

19, అక్టోబర్ 2018, శుక్రవారం

పోలీసుల ముందే భార్యపై కత్తితో దాడి


కౌన్సిలింగ్ కోసం వచ్చిన కుటుంబ సభ్యులపై మరియు తన భార్యపై పోలీసుల కళ్లెదుటే కత్తితో దాడి , ఈ ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన రెహ్మాన్‌కు.. రసూల్‌ పురాకు చెందిన కౌసర్‌ బేగంతో వివాహయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. మద్యానికి బానిసైన రెహ్మాన్.. తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు.. ఆమెను వేధిస్తు జులాయిగా తిరుగుతుండేవాడు. కౌసర్ బేగంపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే కొద్దిరోజుల క్రితం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో కౌసర్ తన పుట్టింటికి వచ్చేసింది.

కౌసర్ పుట్టింటికి వెళ్లినా వదలని రెహ్మాన్.. ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కౌసర్‌తో పాటూ రెహ్మాన్‌ను కౌన్సిలింగ్ ఇచ్చేందుకు గురువారం పిలిపించారు. కౌసర్ తన కుటుంబంతో కలిసి పీఎస్‌కు వచ్చింది. అలాగే రెహ్మాన్ కూడా అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలోనే రెహ్మాన్ తన వెంట తెచ్చుకున్న కత్తి తీసుకొని కౌసర్‌తో పాటూ అత్తమామ, మరో ఇద్దరిపై దాడి చేశాడు.

పోలీసుల ముందే ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడ్ని పట్టుకున్నారు బాధితుల్నివెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రెహ్మాన్‌పై కేసు నమోదు చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad