ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌ పై ఫేస్బుక్ కీలక నిర్ణయం - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

19, అక్టోబర్ 2018, శుక్రవారం

ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌ పై ఫేస్బుక్ కీలక నిర్ణయం


ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్‌, ఫేక్‌ న్యూస్‌ ఇష్యూ ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పదవికి ముప్పుగా మారింది. ఈ సోషల్‌ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్‌ జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి రావడం గమనార్హం. ఫేస్‌బుక్‌ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్‌ ఫండ్స్‌ బుధవారం మార్క్‌ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదన దాఖలు చేసిన వాటిలో ఇల్లినోయిస్‌‌, రోడ్ ఐలండ్, పెన్సిల్వేనియాలకు చెందిన స్టేట్‌ ట్రెజర్స్, న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ స్కాట్ స్ట్రింగర్ ఉన్నాయి. ఇలాంటి ప్రతిపాదనే ఫేస్‌బుక్‌లో 2017లో ఒకసారి వచ్చింది. తాజాగా మరోసారి తెరపైకి రావడం గమనార్హం.

అయితే, ఈ విషయంపై స్పందించడానికి ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. కంపెనీ వార్షిక సమావేశం 2019 మేలో జరగనుంది. స్వతంత్ర బోర్డ్‌ చైర్‌ను నియమించాలని బోర్డును కోరతామని తెలిపారు. జుకర్‌బర్గ్ తొలిగింపు వార్తల నేపథ్యంలో బుధవారం ఫేస్‌బుక్‌ షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. కాగా, పెన్సిల్వేనియా ట్రెజరీ 38,737 షేర్లను, ఇల్లినోయిస్ ట్రెజరీ 1,90,712 షేర్లు, రోడ్‌ ఐలండ్‌ ట్రెజరీ 1,68,230 షేర్లను కలిగి ఉంది. అయితే జుకర్‌బర్గ్‌ 60శాతం ఓటింగ్‌ హక్కులు ఉండటంతో, ఆయన సానుకూలత లేకుండా తొలగింపు సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad