అంపైర్ అలీందార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

26, అక్టోబర్ 2018, శుక్రవారం

అంపైర్ అలీందార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్


  • కొలంబో వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య ఇటీవల ఐదో వన్డే జరిగిన సంగతి తెలిసిందే.
  • ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేయగా , లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 26.1 ఓవర్లు ముగిసే సమయానికి 132/9తో నిలిచింది.
  • ఈ సమయంలో మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది,ఇరుజట్ల క్రికెటర్లు మైదానాన్ని వీడారు. కానీ.. అంపైర్ అలీందార్ మాత్రం మైదానంలోనే ఉండిపోయాడు.
  • వర్షం కొద్ది క్షణాల్లో వస్తుందనగా, అలీందార్ ఇచ్చిన ఔట్‌ (ఎల్బీడబ్ల్యూ)ని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫ్లంకెట్ సవాల్ చేస్తూ డీఆర్ఎస్‌కి వెళ్లడమే..
  • అదే సమయంలో థర్డ్ అంపైర్ టీవీ రిప్లై చూస్తుండగా వర్షం మొదలైంది. దీంతో ఫీల్డ్ అంపైర్ బాధ్యత నిర్వర్తించేందుకు మైదానంలోనే ఉన్న అలీందార్.. రిప్లైలో బంతి వికెట్లను తాకేలా కనిపించడంతో.. ఔట్ నిర్ణయం ప్రకటించిన తర్వాతే మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
  • వర్షం కారణంగా స్కోరర్‌కి తన నిర్ణయం కనబడదేమో అని అలీందార్ ఔట్ అని వేలెత్తి అలానే  బౌండరీ లైన్ వరకూ పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
  • తన వృత్తి నిబద్ధతతో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad