డేటా లీక్ కారణంగా ఫేస్బుక్ పై బారి జరిమానా - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

26, అక్టోబర్ 2018, శుక్రవారం

డేటా లీక్ కారణంగా ఫేస్బుక్ పై బారి జరిమానా


ఫేస్బుక్ గతంలో పొలిటికల్ యాడ్స్ కోసం ఫేస్బుక్ పేజీ వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. అయితే దీనిలో కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్కాండల్, ఫేస్బుక్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాలను 3rd పార్టీ ఆప్ డెవలపర్లకు అందించినట్టు ఐసీవో చెప్పింది. వినియోగదార్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో ఫేస్‌బుక్ విఫలమైనట్లు తెలిపింది. ఇ కారణంచేతనే యూకేకు చెందిన డేటా పరిరక్షణ విభాగం ఫేస్‌బుక్ యాజమాన్యానికి దాదాపు 4.7కోట్ల రూపాయల జరిమానా విధించింది.

ఫేస్బుక్ చేసిన పొరపాట్లు : 
  • 2014 లో ఫేస్బుక్ క్విజ్ ద్వారా వినియోగదారులను తమ వ్యక్తిత్వ శైలిని తెలుసుకోమని ఆహ్వానించింది.
  • ఆ క్విజ్ లో పాల్గున్నవారి సమాచారంతో పటు, వారి స్నేహితుల డేటాను కూడా ఆ అప్ సేకరించింది.
  • క్విజ్ లో పాల్గొన్న వారిలో 30.05 లక్షల మంది దగ్గరే ఫేస్బుక్ అప్ వుంది,కానీ 8.7 కోట్ల మంది డేటాను ఆ క్విజ్ అప్ సేకరించింది.
  • అందులో కొంత డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా (సిఏ) కు అమ్మినట్లు ఆరోపణలున్నాయి.ఓటర్లను అంచనా వేసేందుకు ఆ డాటాను ఉపయోగించారు.
  • తాము చట్టాన్ని అతిక్రమించలేదని, అధ్యక్షా  ఎన్నికల్లో ఆ డాటాను ఉపయోగించలేదని సిఏ తెలిపినది.
  • తమ డేటా దుర్వినియోగం అయిందో లేదో తెలుపుతూ ఫేస్బుక్  వినియోగదారులకు సమాచారం పంపింది.
  • " నమ్మకానికి నష్టం కలిగింది " అంటూ  ఫేస్బుక్ తమ వినియోగదారులకు క్షేమపాన చెపింది. తాము ఏ తప్పు చేయలేదని సిఏ చెపింది.


కేంబ్రిడ్జ్ ఎనలిటికా (సిఏ) అంటే ఏమిటి : 


కేంబ్రిడ్జ్ ఎనలిటికా లిమిటెడ్ (CA) ఒక బ్రిటీష్ రాజకీయ సలహా సంస్థ, ఇది డేటా మైనింగ్, డేటా బ్రోకరేజ్ మరియు డేటా విశ్లేషణలను ఎన్నికల ప్రక్రియల సమయంలో వ్యూహాత్మక సంభాషణలతో కలిపి ఉంచింది.ఇది 2013 లో SCL గ్రూప్ యొక్క శాఖగా ప్రారంభమైంది. ఈ సంస్థలోని ఒక డెవలపర్ అలెగ్జాండర్ కోగన్ 300,000 మంది వ్యక్తులను ఫేస్బుక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఒక అప్ ను ఇన్స్టాల్ చేసేవిధంగా చూసినాడు. అయితే ఈ అప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాలను మరియు వారి స్నేహితుల,బంధువుల వివరాలను కూడా సేకరించింది, అక్షరాలా 87 మిలియన్ల వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండా స్వీకరించారు. ఈ సమాచారాన్ని రాజకీయ కారణాలకు వాడుకునట్టు యూకే సమాచార కమిషనర్ కార్యాలయం (ఐసీఓ) తెలిపింది.

ఈ కారణాలచేతనే ఫేస్‌బుక్ యాజమాన్యానికి దాదాపు 4.7కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు యూకే ఐసీఓ తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad