పాపులారిటీ కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

25, అక్టోబర్ 2018, గురువారం

పాపులారిటీ కోసం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి


పాపులారిటీ కోసం ఒక వ్యక్తి ఏకంగా ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడైన వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడాడు. వివరాల్లోకివెళ్తే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్మోహనరెడ్డి హైదరాబాద్ వెళ్లేందుకు గాను విశాఖ విమానాశ్రయానికి రాగా అక్కడ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ క్యాంటీన్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌ సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌ను  కత్తితో పొడిచాడు. అదితెలుసుకొని అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ భద్రత సిబందిదారులు అతనిని అదుపులో తీసుకున్నారు. అయితే కేవలం పాపులారిటీ కోసం మాత్రమే శ్రీనివాస్ ఈ దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పలు న్యూస్ లో పేర్కొన్నారు.

కానీ ఇదివరకే సినీ నటుడు శివాజీ ఆపరేషన్ ద్రవిడ(గరుడ)పై గతంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వైస్ జగన్ పై దాడి జరుగుతుందని, దీనివల్ల రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని శివాజీ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, పార్టీ నాయకులూ ఇది కేవలం కుట్రతో మాత్రమే జరిగిందని, దీని వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని , అసలు విమానాశ్రయ లాంజ్‌ల వరకు కత్తితో ఎలా రాగలిగారని..? అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై విచారణ చేస్తున్నామని ఏపీ హోమంత్రి చినరాజప్ప చెప్పారు. ఈ దాడి నేపథ్యంలో జగన్‌కు భద్రత పెంచే అంశాన్ని పరిశీలిస్తునం అని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.

ఈ ఘటనపై  KTR తీవ్రంగా కండించారు  "బాధ్యులను కఠినంగా శిక్షించాలని, జగన్ గారు త్వరగా కోలుకోవాలని" అయన తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad