Google plus Going to shutting down soon - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

9, అక్టోబర్ 2018, మంగళవారం

Google plus Going to shutting down soon

గూగుల్ ప్లస్

గూగుల్ ప్లస్ హ్యాక్ అయింది మరియు త్వరలో మూసివేయబడుతుంది 

ముఖ్య కారణాలు 


  • భద్రతాపరమైన లోపాలు ఉండడం
  • వాడకం తక్కువగా ఉండటం

వ్యవహారికంగా గూగుల్ ప్లస్ అని కాని కొన్ని సందర్బాల్లొ జి.ప్లస్ అని పిలుస్తారు , ఇది ఒక సామాజిక గుంపు దీనిని గూగుల్ నిర్వహిస్తొంది. ఈ సేవ 16 జూన్ ,2011 న ఆహ్వాన పద్దతిన మాత్రమే పరీక్షించటానికి ప్రవేశ పెట్టారు . అధికారికంగా 28 జూన్, 2011 తేదీన ప్రారంభించబడింది.

గూగుల్ ప్లస్ ఫేస్బుక్ కు పోటీగా తిస్కోరావడం జరిగింది . కానీ ఫేస్బుక్ కు  January 2011 నాటికి ఫేస్‌బుక్‌లో 600ల మిలియన్లకు పైగా ఉత్సాహభరితమైన వినియోగదారులు ఉన్నారు. గూగుల్ ప్లస్ ఫేస్బుక్ కు పోటీగా నిలువలేక పోయింది.

అంతేకాకుండా  భద్రత, సాఫ్టువేర్ లోపాలతో దాదాపు 5 లక్షల మంది గూగుల్ ప్లస్ సోషల్ మీడియా ఖాతాదారుల వ్యక్తిగత విషయాలు ఇతరుల పరమయ్యాయి. అయితే ఆ డేటా మాత్రం ఎటువంటి హానికి గురికాలేదని గూగుల్ వెల్లడించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఐదు లక్షల మంది యూజర్ల డేటా చోరీ అయినట్లు గుర్తంచారు. దీనిని గూగుల్ అంగీకరించింది. ఇలా పలు కారణాల వల్ల గూగుల్ ప్లస్‌ను మూసివేస్తున్నట్లు గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ ప్రకటించింది. గూగుల్ ప్లస్ వైస్ ప్రెసిడెంట్ బెన్ స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఇప్పటికే గూగుల్ తన చాల సర్వీసెస్ పలు కారణాల చేత ఆపివేయడం జరిగింది . అందులో ఆర్కుట్ ను క్లోజ్ చేసి గూగుల్ ప్లస్ ను తెచ్చింది . ఇపుడు ఇందులో కూడా సాంకేతిక లోపాలు రావడం చేత మూసివేయడం అందిరికి ఆచ్యరానికి గురి చేస్తుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad