Goshamahal Ex-MLA facebook account hacked - AtoZ Crazy Updates | Telugu

A to Z Updates

Home Top Ad

Post Top Ad

9, అక్టోబర్ 2018, మంగళవారం

Goshamahal Ex-MLA facebook account hacked

గోషామహల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయింది.

రాజాసింగ్‌ తన పేరుతో ఓ ఫేస్‌బుక్‌ ఖాతా నిర్వహిస్తున్నారు. ఈ ఫేస్‌బుక్‌ ఖాతాకు అయన పర్సనల్  మెయిల్‌తో లింకై ఉంది. ఐతే తనకు హఠాత్తుగా ఆ ఫేస్‌బుక్‌ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్‌ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్‌ చేయడానికి ప్రయత్నించగా, పాస్‌వర్డ్‌ మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్‌బుక్‌ ఖాతాను కొందరు హ్యాక్‌ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినారు .

దీనిపై రాజాసింగ్‌ గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్‌ బుక్‌ హాక్‌ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇతర పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించారు. గోషామహల్‌ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. ఐతే దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad