Gas pipeline blast in Bhilai steel plant - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

9, అక్టోబర్ 2018, మంగళవారం

Gas pipeline blast in Bhilai steel plant


ఛత్తీస్‌గఢ్‌, దుర్గ్ జిల్లాలోని భిలాయ్ లో  భిలాయ్ స్టీల్ ప్లాంట్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ అవడంతో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడే చెనిపోగా మంటల్లో చిక్కుకున్న  మరో  11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారికి చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఐతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  స్టీల్ ప్లాంట్‌లో బొగ్గును మండించే గ్యాస్ పైప్‌లైన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి, పేలుడు సంభవించినట్టు అధికారులు తెలియచేసినారు . కాగా  పైప్లైన్ లీకేజ్ కి గల కారణాలు తెలియాల్సివుంది .

ఉత్తరప్రదేశ్ లో 48 మంది :

ఇదే విధంగా గతేడాది నవంబర్‌లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్‌చహార్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్  లో పేలుడు సంభవించడంతో 43 మంది మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఆపరేషన్స్ సిబ్బందే అని కమిటీ నివేదికలో పేర్కొంది. యూనిట్‌ను మూసివేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదని దీన్ని కూడా సిబ్బంది విస్మరించిందని అందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కమిటీ రిపోర్ట్ పేర్కొంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad