తెలుగు ప్రజలకు దీపావళి కానుకా: ఎన్టీఆర్ బయోపిక్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

6, నవంబర్ 2018, మంగళవారం

తెలుగు ప్రజలకు దీపావళి కానుకా: ఎన్టీఆర్ బయోపిక్


‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం’ అనే పాట మనందరికి తెలిసిందే, ఇది ఇప్పటికీ ఎప్పటికి ఎవర్ గ్రీన్ పాట అని చెప్పుకోవచ్చు. ఐతే ఇది తెలుగునాట అగ్ర కథానాయకులుగా వెలుగొందిన ఎన్టీఆర్, ఏ.యాన్.ఆర్ కలిసి నటించిన చిత్రం ‘గుండమ్మ కథ’ లోనిది. తెలుగు ప్రజల కోసం ఇదే పాటను మరోసారి వెండితెరపై చూపించబోతున్నారు. ఈ కొత్త ‘గుండమ్మ కథ’లో ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, మహానటి సావిత్రిగా నిత్యా మీనన్ కనిపించనున్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘యన్.టి.ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రంలో ఇంచుమించుగా స్టార్లందరూ నటిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కళ్యాణ్‌ రామ్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, నాగేశ్వరరావుగా సుమంత్, బసవతారకంగా విద్యాబాలన్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఇప్పుడు సావిత్రిగా నిత్యా మీనన్ లుక్ వచ్చింది. కాగా, జనవరి 9న ‘కథానాయకుడు’గా.. 24న ‘మహానాయకుడు’గా ఎన్టీఆర్ బయోపిక్ విడుదల కానుంది.దీపావళి పండుగ సందర్భంగా ‘గుండమ్మ కథ’ చిత్రంలోని ‘లేచింది నిద్ర లేచింది’ పాట స్టిల్‌ను విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపించారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్‌బీకే ఫిల్మ్స్ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. సావిత్రి పాత్రను పోషిస్తుండటంపై నిత్యా మీనన్ ఆనందం వ్యక్తం చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad