రియల్ హీరో అనిపించుకున్న తెలంగాణ పోలీస్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

4, నవంబర్ 2018, ఆదివారం

రియల్ హీరో అనిపించుకున్న తెలంగాణ పోలీస్

Telangana_police

తెలంగాణ పోలీసులు ప్రజలకు దేగ్గరావాలని ,తమకు వారికష్టాలు చెప్పుకోవడానికి భయపడొద్దని ప్రతిసారి తెలియచేస్తూనే వున్నారు. దానికోసం " పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ " అనే అంశాన్ని కూడా తీసుకొచ్చినా విషయం తెలిసిందే. ఐతే దీనిపై ప్రజలా స్పందన కూడా బాగానే వస్తుందని చెప్పుకోవాలి. ప్రజలకు వచ్చే కష్టాలను పోలీసులకు చెప్పుకోవడానికి పోలీస్ వ్యవస్థ బాధితులతో స్నేహముగా పలుకరిస్తూ వారు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.

ఈరోజు దుండిగల్లో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. సకాలంలో స్పందించిన దుండిగల్ పోలీసులు ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు. పోలీస్ వాహనంలో సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో తీసుకురావడంతో ప్రాణపాయం తప్పిందని పేర్కొన్నారు. దీంతో సకాలంలో స్పందించిన పోలీసులు, హోంగార్డు క్రిష్ణారెడ్డికి, వినోద్ కుటుంబసభ్యులతో పాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.

స్థానికులు తెలిపిన కథనం ప్రకారం... మెదక్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్(28) భార్యతో కలిసి గండిమైసమ్మ-దుండిగల్ మండలం, డి.పోచంపల్లి, ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నాడు.

వినోద్‌కుమార్ డోర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం దంపతుల మధ్య చిన్న విషయమై గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వినోద్‌కుమార్ ఆత్మహత్య చేసుకుంటానని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.

భయాందోళనకు గురైన అతని భార్య వెంటనే 100కి డయల్ చేయగా... సమాచారం అందుకున్న దుండిగల్ పీఎస్ పెట్రోలింగ్-2 సిబ్బంది అతని ఇంటికి వచ్చారు.తలుపు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే హోంగార్డు క్రిష్ణారెడ్డి వినోద్‌కుమార్‌ను కిందికి దింపి ఎత్తుకొని కిందకు వచ్చి.. పోలీస్ వాహనంలో సూ రారంలోని మల్లారెడ్డి వైద్యశాలకు తీసుకెళ్లారు.

మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు. AtoZ Crazy Updates 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad