2.0 అధికారిక టీజర్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

4, నవంబర్ 2018, ఆదివారం

2.0 అధికారిక టీజర్


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా సినిమా రోబో #2Point0. సంవత్సరం కన్నా ఎకువా కాలం నుండి అభిమానులు ఈ చిత్రం కోసం వేచిచూస్తున్నారు , ఐతే నిన్న దీని అధికారిక టీజర్  ను విడుదల చేసినారు.

టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ‘2.ఓ’ ఈ నెల 29 వ తేదీన విడుదల కన్నుంది.
ట్రైలర్ హాలీవుడ్‌ స్థాయి గ్రాఫిక్స్‌తో కూడుకున్న గ్రాండ్ విజువల్స్ తో మొదలై.. సెల్ ఫోన్ లు హఠాత్తుగా మాయం.. భయంతో ప్రజలు..అంటూ వాయిస్ తో ట్రైలర్ కొనసాగుతుంది. ఇక రోబోగా రజనీ యాక్షన్ ట్రైలర్ కే హైలెట్ కాగా, ‘సెల్ ఫోన్ వాడుతున్న అందరూ హంతకులే’ అంటూ అక్షయ్ కుమార్ ఓ వైవిధ్యమైన భయంకరమైన గెటప్ లో పరిచయం అయి చాలా బాగా ఆకట్టుకున్నారు.

మొత్తం మీద ప్రస్తుతం మనుషులు వాడుతున్న సాంకేతిక వలన ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వలన పక్షులకు వచ్చే ఇబ్బందులకి, ఆ పక్షులు మనుషుల పై పగ సాధిస్తే.. అప్పుడు మనిషి వాటిని ఎదుర్కోలేకపోతే.. పరిస్థితి ఏమిటి. ఇలాంటి పరిస్థితుల్లో రోబో ఎలా ఎదుర్కొన్నది అన్నదే ట్రైలర్ లో ప్రధానంగా హైలెట్ చేశారు. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఈ ట్రైలెర్ కూడా దాన్నే హైలెట్ చెయ్యడంతో.. ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై ఇంకా భారీ అంచానలు పెరిగాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad