ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రం రేపటినుండి అందుబాటులో - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

23, అక్టోబర్ 2018, మంగళవారం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రం రేపటినుండి అందుబాటులో


ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈరోజు ప్రారంభించారు. రేపటినుండి  నుంచి ఈ వంతెనను అధికారికంగా ప్రజలకు అంకితం చేస్తారు.

 సముద్ర బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకతలు  :



  • ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 55 కిలోమీటర్లు.
  • భూకంపాలు, తుపాన్లను తట్టుకునే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం 4 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ మొత్తం ఉక్కుతో 60 ఐఫిల్ టవర్లను కట్టవచ్చు.
  • ఈ వంతెన నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్లు (దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు) ఖర్చయింది. 
  • రోడ్డు బ్రిడ్జ్ తో పాటు నీటిలో సొరంగం ద్వారా నిర్మితమైన ఈ బ్రిడ్జ్ ఇస్తూరీ నదిని దాటుతూ హాంకాంగ్ లాంతావ్ ద్వీపం, జుహాయ్, మకావూలను కలుపుతుంది.
  • ఈ అద్భుత నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టింది ( 15 December 2009 లో పని మొదలు ).


ఈ వంతెన కట్టడంపై ఆ ప్రాంతీయుల అభిప్రాయం :  



  • ఈ ప్రాజెక్టు మీద విమర్శలు కూడా తీవ్రంగానే వినిపిస్తున్నాయి.
  • ఇదొక 'మృత్యు వంతెన' అని కొన్ని స్థానిక పత్రికలు అభివర్ణించాయి. హాంకాంగ్ వైపు నుంచి కనీసం తొమ్మిది మంది, చైనా వైపు నుంచి మరో తొమ్మిది కార్మికులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.
  • పర్యావరణానికి కూడా ఈ నిర్మాణం హాని చేస్తుందనే ఆరోపణలున్నాయి.ఈ నిర్మాణం ఇప్పటికే సముద్ర జీవరాశికి ఎంతో హాని చేసిందని, ముఖ్యంగా అత్యంత అరుదైన తెల్ల డాల్ఫిన్‌లకు తీరని నష్టం కలిగించిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
  • హాంకాంగ్ లో తన బలగాలను మోహరించేందుకు చైనా ఈ బ్రిడ్జ్ ను నిర్మించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
  • ఇదిలావుండగా బ్రిడ్జ్ నిర్మాణంతో రవాణా, వాణిజ్య కార్యాకలాపాలు అనుకూలంగా ఉంటాయని పలువురు సమర్థిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad