ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లి ప్రాణాలు విడిచి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

30, అక్టోబర్ 2018, మంగళవారం

ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లి ప్రాణాలు విడిచి


ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో దంతెవాడ జిల్లా ఆరాన్‌పూర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.

మావోయిస్టులు చేసిన దాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

దూరదర్శన్‌ మీడియా బృందం ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేసేందుకు అక్కడికి వెళ్లినట్టు సమాచారం.

"నీల్వేలో కొత్తగా నిర్మించిన పోలింగ్ స్టేషన్ని కవర్ చేయాలని మేము యోచించాము, అక్కడి ప్రజలు 1998 వ సంవత్సరం నుండి ఇప్పడిదాకా ఎవరు ఓటు హక్కును వియోగించుకోలేదు." అని మావోయిస్టు దాడిలో గాయపడ్డ విలేకరి తెలిపారు.

మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని అదే సమయంలో దాడి జరిగినట్లు ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు.

సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు తగ్గుముఖం పట్టాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడటం గమనార్హం.

వచ్చే నెలలో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నవంబరు 12న తొలి దశ, 20వ తేదీన రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్‌ జరగనుంది.

మావోయిస్టు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మావోయిస్టుల దాడులపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిలోకి రాకుంటే త్యాగాల కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కేబినెట్‌ను కూడా పంపిస్తామని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad