విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ ను ఇన్స్టాల్ అనిన్స్టేల్ చేస్కోవడం చేస్కోవడం ఎలా
విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ లో వచ్చిన బగ్స్ మనం ఇదివరకే తెలుసుకున్నాము , విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ వలన కొంత మంది ( ఇన్స్టాల్ చేసుకున్న ) వారి డేటా లోని ఫైల్స్ తొలిగించబడడం , ప్రొఫైల్ ఫోటో డిలీట్ అవడం వంటి లోపాలు వచ్చాయి . అందుకోసం మైక్రోసాఫ్ట్ మల్లి విండోస్ 10 అక్టోబర్ లో వున్నా సమస్యలను వినియోగ దారుల ఫిర్యాదుల ప్రకారం వాటిని సరిచేసి మల్లి కొత్త అప్డేట్ ను అక్టోబర్ 11 న విడుదల చేసింది. అయితే ఈ పాత అప్డేట్ మీరు ఇన్స్టాల్ చేస్కున్నటైతే ఎలా అనిన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం .
పాత అప్డేట్ ను తొలిగించడం ఎలా :
ముందుగా మీరు విండోస్ బటన్ పై క్లిక్ చేసి , సెట్టింగ్స్ ను ఏంచుకోవాలి. సెట్టింగ్స్ విండోస్ ఓపెన్ అయినా తరువాత అందులో కింద చూపిన చిత్రం ప్రకారం అప్డేట్ మరియు సెక్కురిటీ ను ఎంపిక చేసుకోవాలి.తర్వాతి విండో, మీరు చివరిగా అప్డేట్ ను ఇన్స్టాల్ చేసుకున్న తేదీ ఉంటుంది . మీరు అక్టోబర్ 9,10 తేదీలో ఇన్స్టాల్ వున్నటైతేయ్ , అప్డేట్ హిస్టరీ చూపించు దానిని ఎంపిక చేసుకోవాలి. ఇందులో మీకు అనిన్స్టాల్ అప్డేట్ ను ఎంపిక చేసుకుంటే కింద చూపిన చిత్రం ప్రకారం కొత్త విండో తెరువ బడుతుంది.
ఇందులో మీకు installed on పై క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్డేట్ తేదికి అనుసారంగా చూపుతుంది. కాబట్టి మీరు తేదీలో ఇన్స్టాల్ చేసిన అప్డేట్ ను ఒక్కోటిగ్గా అనిన్స్టాల్ ( ఇంటర్నెట్ సదుపాయం తీసివేసి ) చేసుకోవాలి.
అంతే , ఇక మీరు బగ్స్ వున్నా అప్డేట్ ను విజయ వంతముగా అనిన్స్టాల్ చేసుకున్నారు . ఇప్పుడు లాప్టాప్/ కంప్యూటర్ ను షూట్డౌన్ చేసి తిరిగి ఆన్ చేయండి .
కొత్త అప్డేట్ ను ఇన్స్టాల్ చేస్కోవడం :
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ ను దోషాలను తొలిగించి మల్లి ఆ అప్డేట్ ను 11 వ అక్టోబర్ 2018 న అధికారికంగా విడుదల చేసింది. దీనిని మనం ఇన్స్టాల్ చేస్కోవడానికి రెండు పద్ధతులు వున్నాయి, అవి ఎలా అనేది మనం చూదాంమొదటి పద్దతి :
ముందుగా మనం విండోస్ అప్డేట్ అండ్ సెక్కురిటీ సెట్టింగ్స్ లో వెళ్ళాలి . తదుపరి చెక్ ఫర్ అప్డేట్ పై క్లిక్ చేస్తే విండోస్ అప్డేట్ ను వెతికి ప్రస్థుం అప్డేట్ అయివున్న విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ ను చూపిస్తుంది మరియు అది అప్డేట్ చేయబడుతుంది .రెండవ పద్దతి :
మనం మనువల్గ కూడా ఈ అప్డేట్ ను మైక్రోసాఫ్ట్ విండోస్ వెబ్సైట్ నుండి కూడా ఇన్స్టాల్ చేస్కోవచ్చు . అయితే ఇందుకు గాను మనం ముందుగా ఈ లింక్ ను ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.డౌన్లొడ్ చేయబడిన ఫైల్స్ ISO ఇమేజ్ ఫైల్ ను కలిగి ఉంటుంది, కాబట్టి అది CD లేదా DVD లను బర్న్ చేయగలవు మరియు USB బూటబుల్ కూడా చేయగలదు. ఇపుడు మీరు USB లేదా సీడ్ ద్వారా కొత్త అప్డేట్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
విండోస్ ను CD /DVD లేదా USB బూటబుల్ ఎంపికతో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మన తరువాతి టెక్నికల్ అప్డేట్ లో నేర్చుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి