హైదరాబాద్ లో ఇంటెల్ నుండి 15000 ఉద్యోగాలు త్వరలో - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

10, నవంబర్ 2018, శనివారం

హైదరాబాద్ లో ఇంటెల్ నుండి 15000 ఉద్యోగాలు త్వరలో

Intel_Jobs_Hyderabad

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంటెల్ ఐటి సంస్థ తమ సాంకేతిక అబిరుద్ది కేంద్రం హెద్రాబాదులో ఏర్పాటుకు అన్ని పనులు పూర్తిచేసుకున్నటు తెలిపింది. మూడువేల కోట్లతో స్థాపించబడే ఈ కేంద్రం ద్వారా మొదటి విడతలో 15000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

ఇంటెల్ భరత విభాగాధిపతి నివృత్తి రాయి తెలంగాణ సమాచార సాంకేతిక మంత్రి కేటీఆర్ ను కల్సి తమ కొత్త సాంకేతిక అబిరుద్ది కేంద్ర స్థాపనకై చేర్చించారు. తమ గ్లోబల్ సంస్థ సీఈఓ త్వరలో హైదరాబాద్ వచ్చి సీఎం కెసిఆర్ ను కలుస్తారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంటెల్ సంస్థ తమ కార్యకలాపాలను దేశంలో విస్తరిస్తోందని తెలిపారు. ఐతే ఇంటెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ హైద్రాబాద్ను కొత్త ప్రాజెక్ట్ కోసం ఏంచుకోవడంవల్లా రాజధానికి , మన తెలంగాణకు మరింత ఖ్యాతి వస్తుందని మరియు పెద్ద ఎత్తున్న ఉపాధి కల్గుతుందని కేటీఆర్ అన్నారు. తమ కార్యకలాపాల కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్‌ ఇంటెల్ సంస్థ కు ధన్యవాదాలు తెలిపారు.

నవంబర్ 15 న బెంగుళూరులో నిర్వహించనున్న ఇంటెల్ ఇండియా 20 వ వార్షికోత్సవానికి హాజరవ్వాలని నివృత్తి రాయి మంత్రి కేటీఆర్ ను కోరారు.తెలంగాణ ఫైబర్ గ్రిడ్ లో భాగంగా ఇంటింటికి ఇంటర్నెట్ తీర్చే కార్యక్రమం పైన వివరాలు అడిగి తెలుసుకున్న ఇంటెల్ ప్రతినిధులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశంలో సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలన చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతోపాటు టీ- వర్క్స్ , తెలంగాణ లో ఉన్న పలు స్టార్ట‌ప్‌ కంపెనీ లతో కలిసి పనిచేసేందుకు ఇంటెల్ సుముఖంగా ఉన్నదని తెలిపారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad