అరవింద సమేత నేడే విడుదల - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

10, అక్టోబర్ 2018, బుధవారం

అరవింద సమేత నేడే విడుదల


చిత్రం: అరవింద సమేత
విడుదల తేదీ: 11 అక్టోబర్, 2018
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
స్క్రీన్‌ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అరవింద సమేత మరి కొద్దీ గంటల్లో థియేటర్లలోకి రానుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం " అరవింద సమేత.. వీర రాఘవ ". యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా నిర్మాత చినబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్‌తో మరోసారి ఎన్టీఆర్‌ను వీర రాఘవగా సరికొత్తగా త్రివిక్రమ్ చూపించబోతున్నారు.

రాయలసీమ నేపథ్యంతో కక్షలు, కారుణ్యాలు, వైషమ్యాల కథతో ఈ చిత్రం రూపొందింది.
జగపతి బాబు పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.వరుస విజయాలతో దూసుకెళ్తున్న పూజా హెగ్డే తొలిసారి ఎన్టీఆర్‌తో జత కట్టింది. పూజా హెగ్డే చుట్టే కథ తిరుగడం స్పెషల్ ఎట్రాక్షన్.మహిళా సాధికారిత అనే పాయింట్ చుట్టు అరవింద సమేత కథను అల్లారు. ఈ ఫ్యాక్షన్‌లో ఓ మహిళకు స్థానం కల్పిస్తే ఏమి జరుగుతుంది అనేది కథలో కీలకపాయింట్. అది ఎన్టీఆర్‌కు కూడా బాగా నచ్చింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. యుద్ధం చేసేవాడికే శాంతి గురించే మాట్లాడే అర్హత ఉంటుంది అనే పాయింట్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇక ఈచిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది. ఇప్పటికే అడ్వాన్ బుకింగ్ భారీ స్థాయిలో జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad