సిటీ కి కొత్త పోలీస్ : సీసీ కెమెరా - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

23, అక్టోబర్ 2018, మంగళవారం

సిటీ కి కొత్త పోలీస్ : సీసీ కెమెరా

తెలంగాణ రాష్ట్రము ఏర్పడినప్పటినుండి  హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతి విషయంలో భద్రతను పెంచుతూనే వస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ అంశాలపైనా , మహిళల భద్రతపై , విద్యార్థుల పై జరిగే అరాచకాల కోసం ఇంకా అనేక సమస్యలకోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఫ్రెండ్లీ పోలీస్ అనే అంస్యాని తెచ్చింది.

అయితే ఇటీవల్ల చాల క్రైమ్ కేసు లో సీసీ కెమెరా ప్రధానంగా దోహదం చేయడంతో అనేక కేసు లను పోలీసులు క్లియర్ చేసినారు. కాబట్టి సిటీ పోలీసులు సీసీ కెమెరాలను పెంచాలని వాటి భద్రతలను పోలీసులకు-ప్రజలకు  సహాయంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే " మేము సైతం " అని సీసీ కెమెరా వాటి భద్రతలను గురించి ప్రజల దృష్టికి తెచ్చేలా దీనిని చేపట్యారు.

సిటీ లోని అన్ని సీసీ కెమెరాలు పోలీస్ కంట్రోల్ లో ఉండేలా  కైట్-ఐ : 


రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఆధునిక టెక్నాలజీ పోలీసుల్లో ఉత్సాహన్ని నింపుతున్నది. రాచకొండ ఐటీ అధికారులు సరికొత్త టెక్నాలజీపై అవగాహన కల్పిస్తూ ప్రతి పోలీసుకు సాంకేతిక పరిజ్ఞాణాన్ని అందిస్తున్నారు . ఈ నేపథ్యంలో పతంగి కన్ను(కైట్-ఐ) అప్లికేషన్‌తో పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి సీసీ కెమెరా అనుసంధానం చేశారు . దీంతో పోలీసు కమిషనరేట్ పరిధిలోని 58 వేల సీసీ కెమెరాల మ్యాపింగ్ పూైర్తెంది. ఈ ప్రక్రియతో ఇప్పుడు పోలీసులు అత్యంత సులభంగా నేరస్థుడిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను మ్యాపింగ్ చేసుకుంటే చాలు నేరం చేసిన వ్యక్తి ఆనవాలు క్షణాల్లో లభించనుంది. ఇందుకోసం రాచకొండ ఐటీ సెల్ అధికారులు టెక్‌డాటమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా కైట్ ఐ(పతంగి కన్ను) అప్లికేషన్‌ను తయారు చేశారు. అంతేకాకుండా ప్రతి కెమెరాను జియోట్యాగింగ్ చేయడం పోలీసు అధికారులకు మరింత కలిసి వచ్చింది.

కైట్-ఐ ప్రతేకతలు :



  • ఈ అప్లికేషన్‌లో ప్రతి సీసీ కెమెరా లొకేషన్, ఐపీ అడ్రస్, కెమెరా సామర్థ్యం, కెమెరా స్పష్టత తదితర అంశాలను భద్రపర్చారు.
  • సంబంధిత సీసీ కెమెరా లొకేషన్‌కు వెళ్లి అక్కడ యాప్‌లో లాగిన్ అయ్యి మొత్తం వివరాలను నమోదు చేశారు,వాటిని గూగుల్‌లో ఎంట్రీ చేశారు. 
  • ఈ వివరాలను టీఎస్ కాప్ యాప్ ద్వారా లింక్ చేయడంతో పోలీసులు సీసీ కెమెరాల లొకేషన్ ఆచూకీ కొట్టగానే మొత్తం వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • కెమెరాల డేటాను మూడునెలలపాటు నిల్వ ఉంచడంతోపాటు ప్రతి దృశ్యాన్ని బ్యాక్ అప్ కింద జమ చేసుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • ఈ విధంగా కైట్ ఐ ప్రతి సీసీ కెమెరాను కనెక్ట్ చేసి మొత్తం కమిషనరేట్ ప్రాంతాన్ని ఒక దృశ్యంగా మలిచి ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్రాంతానికి సంబంధించిన సీసీ కెమెరాల వివరాలు కావాలన్న కమాండ్ కంట్రోల్‌లోని టీవీలలో ప్రత్యక్షమయ్యేలా రూపొందించారు.


నేను సైతం : 


రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 58 వేల సీసీ కెమెరాల కండ్లు తెరుచుకున్నాయి. ఇందులో కమ్యూనిటీ సీసీటీవీ కార్యక్రమం కింద 6183, నేను సైతం కింద 50,855 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్బీనగర్ జోన్‌లో నేను సైతం కింద-21 వేలు, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద-2918, మల్కాజిగిరి జోన్‌లో నేను సైతం కింద-27,475, కమ్యూనిటీ సీసీటీవీ కింద-1746, యాదాద్రి భువనగిరి జోన్‌లో నేను సైతం కింద-1680, కమ్యూనిటీ సీసీటీవీ కింద-1519 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకా ప్రజలు సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad